ఇవాళ సుప్రీంలో ఏపీ హైకోర్టుపై విచారణ

ఇవాళ సుప్రీంలో ఏపీ హైకోర్టుపై విచారణ

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపు పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం పదిన్నరకు ఏపీ లాయర్స్ అసోసియేషన్ వేసిన పిటీషన్‌ను ధర్మాసనం విచారించనుంది. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా హడావుడిగా విజయవాడకు హైకోర్టు తరలింపును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఏపీ లాయర్స్‌ ఆశ్రయించారు. తరలింపునకు వ్యవధి ఇవ్వకుండా ఉన్నపళంగా తరలిపోవడం సాధ్యం కాదని వారు వాపోతున్నారు.