బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇవే..!

బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇవే..!

కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కింది అరకొరేనని తెలుగురాష్ట్రాలకు చెందిన నేతలు పెదవి విరుస్తున్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన నిర్మలా సీతారామన్... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకు చేసిన కేటాయింపులను వివరించారు... ఏపీలోని సెంట్రల్ యూవర్సిటీకి రూ.13 కోట్లు, ట్రైబల్‌ యూనివర్సిటీకి రూ. 8 కోట్లు కేటాయించిన కేంద్రం... తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇవి మినహా తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయించిందేమీ లేదు. ఏపీలోని ఐఐటీ, ఐఐఎం, నిట్‌, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీలకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు నిల్ కాగా... తెలంగాణలోని మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు మొండి చెయ్యే చూపించింది.