ధర్మాబాద్ కోర్టు వారెంట్లపై సభలో బాబు ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ మూడు బిల్లులు ప్రవేశపెట్ట నుంది ప్రభుత్వం... మోటారు వాహనాల పన్ను, వైద్య, దంత సంస్థలకు సెమీ అటానమస్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్‌పై మరో బిల్లు కూడా ప్రవేశపెడతారు. ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఉపాధికల్పనపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుండగా... జూనియర్ కళాశాలల్లో గిరిజన విద్యార్థులకు అడ్మిషన్లపై, పోలంపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి తదితర అంశాలపై, ప.గో. జిల్లాలో సాగునీటి కాల్వల్లో కాలుష్యంపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసుపై చర్చించనున్నారు. విభజన హామీలు అమలు చేయకపోవడంపై, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధికల్పన, మౌలిక సదుపాయాలపై లఘు చర్చ జరగనుంది. ఇక ఈ మధ్య హాట్ టాఫిక్‌గా మారిన ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్లపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది... వారెంట్ల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అసెంబ్లీలో ప్రస్తావించే ఛాన్స్ ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)