ఏపీ కేబినెట్ తొలి భేటీ..

ఏపీ కేబినెట్ తొలి భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ నూతన మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు వెలగపూడిలోని ఏపీ సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులోని సమావేశం మందిరం ఈ భేటీ ప్రారంభమైంది. ఇక, అందరి దృష్టి ఇప్పుడు ఏపీ కేబినెట్ తొలి సమావేశంపైనే ఉంది. తొలి కేబినెట్‌లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా సీఎం వైఎస్ జగన్ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇక, సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్‌ అజెండాను రూపొందించారు.