ఈ నెలలోనే కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన...

ఈ నెలలోనే కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన...

ఈ నెలలోనే కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది... అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుండగా... పలు అంశాలపై ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు... రామాయపట్నం పోర్ట్ ఏర్పాటుపైన కూడా కేబినెట్‌లో చర్చించారు. విశాఖ మెట్రోకు కేంద్రం సాయం చేయకున్నా రాష్ట్రమే చేపట్టాలని కేబినెట్‌లో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక అన్న క్యాంటిన్‌ చారిటబుల్ ట్రస్ట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు... రూరల్ వాటర్ సప్లయ్ కోసం అవసరం అయ్యే నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ప్రయత్నాలు చేయడంపై కూడా కేబినెట్‌లో చర్చించినట్టు తెలుస్తోంది.