ఏపీ కేబినెట్ భేటీ : టీడీపీ హయాంలో కేటాయింపులు రద్దు

ఏపీ కేబినెట్ భేటీ : టీడీపీ హయాంలో కేటాయింపులు రద్దు

అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకానికి ఆమోదం తెలిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా, గోదావరి కాల్వల శుభ్రం చేసేందుకు శుద్ధి మిషన్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఛైర్మన్‌గా ఉంటారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన 498.3 ఎకరాల భూకేటాయింపు రద్దు చేసింది. అలాగే విశాఖలో లులూ గ్రూపునకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణo కోసం భూ కేటాయింపులను కూడా ఏపీ కెబినెట్  రద్దు చేసింది.

గతంలో లూలు సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. ఇక అనుమతి లేకుండా నివాసాలు ఏర్పాటుచేసుకున్న వారి ఇళ్లు క్రమబద్ధీకరించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు వంద గజాల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపింది. మిగతావారికి మార్కెట్ రేటు ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది. అమ్మఒడి పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు సమకూర్చుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెల్లకార్డు, ఆధార్ కార్డు ఉండి.. పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్న ప్రతి తల్లికి పథకం వర్తిస్తుందని సర్కారు తెలిపింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పింది.