నేడు ఏపీ కేబినెట్ భేటీ

నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది... ఈ భేటీ నిన్నే జరగాల్సి ఉండగా... టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతికి సంతాపసూచకంగా వాయిదా వేశారు సీఎం చంద్రబాబు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో సమావేశం కానున్న కేబినెట్... కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక రేపు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.