ఏపీ కేబినెట్ కీలక భేటీ..

ఏపీ కేబినెట్ కీలక భేటీ..

నేటితో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి... అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల కోడ్‌ వస్తున్న తరుణంలో వివిధ పెండింగ్‌ అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో 7 జిల్లాల పరిధిలో త్వరలోనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. మరోవైపు ఈ కేబినెట్ మీటింగే చివరి కేబినెట్ అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అన్ని విధాన నిర్ణయాలకు ఇవాళ ఆమోదం లభిస్తుందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ లేట్ అయితే మరో కాబినెట్ భేటీకి అవకాశం ఉంటుంది. మార్చి నెల 10 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగుసే సమయానికి జనరల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇవాళ జరిగే కేబినెట్ సమావేశం కీలకంగా మారింది.