నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ...

నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ...

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, వివిధ సంస్థలకు భూకేటాయింపులు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నీతి ఆయోగ్ సమావేశం వేదికగా తమ ఆవేదనను వినిపించిన చంద్రబాబు... తన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విశేషాలను కూడా మంత్రి వర్గ సమావేశం ముందు ఉంచే అవకాశం ఉంది.