కేబినెట్‌లోకి కిడారి కుమారుడు శ్రవణ్‌

కేబినెట్‌లోకి కిడారి కుమారుడు శ్రవణ్‌

ఆంధ్రప్రదేశ్‌ విస్తరణకు ముహూర్తం దగ్గర పడుతోంది... ఈ నెల 11వ తేదీన ఆదివారం రోజు ఏపీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇటీవ‌లే మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వర‌రావు త‌న‌యుడు శ్రవ‌ణ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది... ఇప్పటికే సీఎంవో నుంచి కిడారి శ్రవణ్‌కు ఫోన్ వెళ్లింది... కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు శ్రవణ్‌కు సీఎంవో అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రవ‌ణ్ యువ‌కుడు, వారణాసి నుంచి ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన ప‌ట్టభ‌ద్రుడైన శ్రవణ్‌... ప్రస్తుతం సివిల్స్‌ ప్రిపరేషన్‌లో ఉన్నాడు. కాబ‌ట్టి గిరిజ‌న కోటాలో అత‌న్ని కేబినెట్‌లోకి తీసుకుంటే జ‌నంలోకి మంచి సంకేతాలు వెళ్తాయ‌ని ఏపీ సీఎం భావనగా కనిపిస్తోంది. త్వర‌లోనే అర‌కు అసెంబ్లీకి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇక్కడి నుంచి శ్రవ‌ణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ నేప‌థ్యంలో ముందే అత‌న్ని మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌డం బెటరనే నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు. ఇక గ‌తంలో భూమా నాగిరెడ్డి మృతి తర్వాత ఆయన కూతురు భూమా అఖిల‌ప్రియను కేబినెట్‌లోకి తీసుకున్న చంద్రబాబు... ఇక కిడారి శ్రవ‌ణ్‌ను కూడా అలాగే ఏపీ కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారు.