12 గంటల వరకు ట్రెండ్స్..

12 గంటల వరకు ట్రెండ్స్..

మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రెండ్స్ తెలిసిపోతాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది... కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని వెల్లడించిన ద్వివేది.. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ ముందుగా లెక్కిస్తామని.. 12 గంటల వరకు ట్రెండ్స్ తెలిపోతాయన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర మీడియా సెంటర్‌తో పాటు ఎప్పటికప్పుడు అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందని తెలిపారు. ఫలితాల ప్రకటనకు రాత్రి అయ్యే అవకాశం ఉందన్న ద్వివేది... అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరు లాటరీ ద్వారా వీవీ ప్యాట్ల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. ఇక వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కనే ఫైనల్ అవుతుందన్నారు. రౌండ్‌ల వారీగా ప్రకటన ఉంటుందన్న ద్వివేది.. వీవీ ప్యాట్‌ల స్లిప్పుల లెక్క వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ప్రకటన చేస్తామన్నారు. మరోవైపు కౌంటింగ్ తర్వాత రీపోల్ జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు ద్వివేది.