సెలవుపై వెళ్లిన సీఈవో గోపాలకృష్ణ ద్వివేది..!

సెలవుపై వెళ్లిన సీఈవో గోపాలకృష్ణ ద్వివేది..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళ్లారు... రేపటి నుంచి (11వ తేదీ) ఈ నెల 15వ తేదీ వరకు ఆయన వ్యక్తిగత కారాణాలతో సెలవు పెట్టినట్టు తెలుస్తోంది. తిరిగి ఈ నెల 16వ తేదీన విధుల్లో చేరున్నారు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది. మొత్తంగా ఐదు రోజుల పాటు ద్వివేది సెలవుపై వెళ్లనున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా... ఎన్నికల ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీలో పాలకపక్షం టీడీపీ, ఎన్నికల కమిషన్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దేశం, ఇరత రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో ఎన్నికల కోడ్ పేరుతో ఎన్నికల కమిషన్ ప్రభుత్వ రివ్యూలను సైతం అడ్డుకుంటోందని టీడీపీ నేతలు మండిపడుతూనే ఉన్నారు.