మాయావతితో బాబు భేటీ

మాయావతితో బాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భేటీ అయ్యారు.

అంతకు ముందు ఆయన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో సమావేశమయ్యారు. ఈ ఉదయం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి మెజారిటీ రాకపోతే అనుసరించాల్సిన వ్యూహం సిద్ధం చేయాల్సిందిగా ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు తెలిసింది. 

టీడీపీ అధ్యక్షుడు ఇప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో అనేక మార్లు చర్చలు జరిపారు. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారామ్ యేచూరి ఉన్నారు.