25 మందితో కేబినెట్.. రెండున్నరేళ్ల తర్వాత 20 మంది మార్పు..!?

25 మందితో కేబినెట్.. రెండున్నరేళ్ల తర్వాత 20 మంది మార్పు..!?

కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం భేటీ కానుంది... ఈ సమావేశంలోనే కేబినెట్ కూర్పుపై క్లారిటీ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 25 మందితో కేబినెట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీఎల్పీలో కేబినెట్ కూర్పు.. ఎక్కడ? ఎవరికి? ఎందుకు? మంత్రి పదవులు ఇస్తున్నామో ఎమ్మెల్యేలకు వివరించనున్నారు సీఎం జగన్. అయితే, వైఎస్ జగన్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మొత్తం 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేయనున్న జగన్మోహన్ రెడ్డి... మరో రెండున్నరేళ్ల తర్వాత 20 మందిని మార్చే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. అంటే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి... వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ మంత్రుల మార్పు.. పనితీరును బట్టి ఉంటుందా..? లేకా ప్రతీ జిల్లా నుంచి కేబినెట్‌కు పోటీ తీవ్రంగా ఉండడతో రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా.. 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత ఏకంగా 20 మంది మంత్రులను ఒకేసారు మార్చడం అంటే చాలా సాహాసంతో కూడుకున్న పనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.