రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..

రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు... సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పట్టి నుంచి నవ రత్నాల అమలుపై దృష్టిపెట్టిన వైఎస్ జగన్... వరుసగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పడమే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించారు సీఎం జగన్. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రైతులకు 9 గంటలు పగటిపూటే కరెంటు ఇవ్వబోతున్నారు. రేపటి నుంచి వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 60శాతం ఫీడర్లలో పంపుసెట్లకు పగటిపూట ఉచిత విద్యుత్ అమలు చేయాలని ఆదేశించిన ఏపీ సీఎం... మిగతా 40శాతం ఫీడర్లలో పనులకు రూ.1700 కోట్లు విడుదల చేశారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జులై 30వ తేదీ నాటికి మిగతా ఫీడర్లలో 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.