మంత్రులకు జగన్ షాక్.. ఇకపై వారి ఫోటోలు కనిపించవు... 

మంత్రులకు జగన్ షాక్.. ఇకపై వారి ఫోటోలు కనిపించవు... 

ప్రభుత్వ పధకాల విషయంలో వైఎస్ జగన్ సర్కార్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.  నిత్యం ఏదో ఒక పధకాన్ని అమలు ప్రవేశపెడుతూ... వాటిని అమలు చేస్తూ దూసుకుపోతున్నది సర్కార్. ఇప్పటి వరకు ప్రభుత్వ పధకాలు అమలు చేసే సమయంలో ప్రచార చిత్రాలపై ముఖ్యమంత్రి ఫొటోలతో పాటుగా, మంత్రుల ఫోటోలను కూడా ముద్రించేవారు. 

ఈ విషయంలో జగన్ సర్కార్ కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది.  ఇకపై ప్రచార చిత్రాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో తప్పించి మరొకరి ఫోటో ఉండకూడదని సీఎంవో కార్యాలయం ఆదేశించింది.  మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  ఇకపై ప్రభుత్వ పధకాల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్ ఫోటో తప్పించి మరొకరి ఫోటో కనిపించదన్నమాట.