ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కేసులు

ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. . గడచిన 24 గంటల్లో 12,613 మంది నమూనాలు పరీక్షించగా 115 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. , వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 33 ఉండగా.. రాష్ట్రంలో 82 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. . దీంతో రాష్ట్రంలో మొత్తం 3200 కరోనా కేసులు నమోదయ్యాయి.  40 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా 2209 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు కరోనా కారణంగా 64 మంది మరణించారు.  

అటు ఇండియాలో సైతం భారీగా కేసులు నమోదవుతున్నాయి.  ఇండియాలో 24 గంటల్లో 8,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 204 మంది మృతి చెందారు. ఇక ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 1,98,706 కాగా అందులో యాక్టీవ్ కేసులు 97,581. కరోనాకు చికిత్స పొంది  డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 95,526. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి  సంఖ్య  5,598కు చేరింది. ప్రతి రోజు ఆరు వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.