ఏపీలో కర్ఫ్యూ సమయం కుదింపు...11 దాటితే వాతలే !

ఏపీలో కర్ఫ్యూ సమయం కుదింపు...11 దాటితే వాతలే !

ఏపీలో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని కుదించారు. ఇప్పటిదాకా ఒంటిగంట దాకా ఉన్న సమయాన్ని ఇప్పుడు పదకొండు గంటలవరకే కుదించారు. ఈ విషయం మీద మంత్రి ఆళ్ళ నాని క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి చందకుండా మరికొన్ని కార్యక్రమాలు చేపడునుతున్నామని ఇప్పటిదాకా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బయట నిత్యావసర కొనుగోళ్లకు ఇచ్చామని ఇప్పుడు ఆ సమయాన్ని 6 నుండి 11 గంటల వరకు కుదిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు కొరత రాదన్న ఆయన 11 తర్వాతా ఎవరు రోడ్లపైకి రాకూడదని అన్నారు.

నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రతి షాపు దగ్గర ధరల పట్టిక ఏర్పాటుకు ఆదేషాలు జారీ చేశామని పేర్కొన్నారు. అధిక ధరలకు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. రెండో సర్వే మరింత పటిష్టంగా చేయాలని సీఎం సూచించారని ప్రతి ఇంటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సీఎం కోరారని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు  చేసామని ఆయన అన్నారు. భోజనం కోసం వారికి ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశామని అన్నారు.