ఏపీలో 12 మంది మంత్రులు వెనుకంజ..

ఏపీలో 12 మంది మంత్రులు వెనుకంజ..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. వైసీపీ ప్రభంజనంలో మంత్రులు సైతం వెనుకబడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో మంత్రలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, ఆదినారాయణరెడ్డి, సిద్ధా రాఘవరావు, భూమా అఖిలప్రియ, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాస్‌రావు, సుజయకృష్ణ రంగారావు, కళావెంకట్రావు వెనుకంజలో ఉన్నారు. ఇక దేవినేని ఉమ, జవహర్, ప్రత్తిపాటి, అమర్నాథ్ రెడ్డి ముందంజలో ఉన్నారు.