కీలక నిర్ణయాలకు తొలి కేబినెట్ ఆమోదం..

కీలక నిర్ణయాలకు తొలి కేబినెట్ ఆమోదం..

ఏపీ కేబినెట్ తొలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది... సామాజిక పెన్షన్లు రూ.2,250కు, ఆశా వర్కర్ల జీతాలు రూ. 3000 నుంచి రూ.10,000కు పెంచూత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ చెల్లింపుకు పచ్చజెండా ఊపింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు క్యాబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. కమిటీని ఏర్పాటు చేసి.. మూడు నెలల్లో విలీన ప్రక్రియను పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ రైతు భరోసా అమలుపై చర్చించిన కేబినెట్.. అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక, గిరిజన సంక్షేమశాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల వేతనాలను రూ. 400 నుంచి రూ. 4000కు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 7,265 మందికి లబ్ధిచేకూరనుంది. పలు సంచలన నిర్ణయాలకు తొలి కేబినెట్ వేదికైంది. గత ప్రభుత్వం అవలంభించిన విధానాలకు పూర్తి భిన్నంగా ముందుకు వెళ్లేలా నిర్ణయాలు తీసుకుంది జగన్ కేబినెట్.