కరోనా టెస్ట్‌ల ధరలు భారీగా తగ్గింపు..
కరోనా టెస్ట్‌లు చేయించుకునేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కరోనా టెస్టుల ధరలను మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సర్కార్.. ఉత్తర్వులు జారీ చేసింది.. కరోనా టెస్ట్ కిట్ల తయారీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు తగ్గాయని జీవోలో పేర్కొంది. ఈ మేరకు కరోనా టెస్టింగ్ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరలను రూ. 800 నుంచి రూ. 475కు తగ్గించింది ప్రభుత్వం... ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లకు వెళ్లి చేయించుకునే కరోనా టెస్టింగ్ ధరలను రూ. 1000 నుంచి రూ. 499కు కుదించింది. మొత్తంగా ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లకు వెళ్లి చేయించుకునే కోవిడ్ టెస్ట్ ధర సగానికి తగ్గించగా.. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరను దాదాపు సగం వరకు కుదించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)