టెన్త్ పరీక్షలు.. సమయాన్ని పెంచుతూ ఉత్తర్వులు

టెన్త్ పరీక్షలు.. సమయాన్ని పెంచుతూ ఉత్తర్వులు

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు పరీక్ష రాసే సమయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మొదటి, ద్వితీయ, తృతీయ భాష ప్రశ్న పత్రాలు, గణింతం, సామాజిక శాస్త్రం సబ్జెక్టులకు 3 గంటల 15 నిముషాల సమయాన్ని కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది... ఈ ఐదు సబ్జెక్టులను 100 మార్కులకు ప్రశ్నా పత్రాలు ఉంటాయని స్పష్టం చేసింది.. భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం ప్రశ్నా పత్రాలకు  2 గంటల 15 నిముషాల సమయాన్ని పెంచారు.. రెండు పత్రాలకు 50 మార్కుల చొప్పున ప్రశ్నలు ఉండనున్నాయి.. కంపోజిట్ కోర్సులోని రెండో భాష పేపర్-2కు 1.45 నిముషాల సమయం కేటాయించారు.. ఒకేషనల్ కోర్సు పరీక్షకు రెండు గంటల సమయం ఇచ్చారు.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మార్పులు చేసిన ఈ సమయాలను వర్తింప చేయాల్సిందిగా పరీక్షల డైరెక్టర్ ను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.