డిగ్రీ, ఫీజీ ఫీజులు ఫైన‌ల్ చేసిన స‌ర్కార్

డిగ్రీ, ఫీజీ ఫీజులు ఫైన‌ల్ చేసిన స‌ర్కార్

రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులను ఫైన‌ల్ చేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్.. 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరాలకు గానూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణా కమిషన్ నిర్ధారించిన ఫీజులు అమలు చేయాలని నోటిఫికేషనులో పేర్కొంది ప్ర‌భుత్వం.. సైన్సు, ఆర్ట్స్ విభాగాల్లోని వేర్వేరు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు ఫీజులను నిర్ధారిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.. మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు రూ. 27 వేలుగా.. కెమిస్ట్రీ కోర్సులకు రూ. 33 వేలుగా వార్షిక ఫీజు నిర్ధారించింది. బయో టెక్నాలజీ కోర్సులకు రూ. 37,400గా ఫైన‌ల్ చేశారు. 

ఇక‌, కంప్యూటర్ అప్లికేషన్సుకు రూ. 24,200, జెనెటిక్సుకు రూ. 49 వేల ఫీజుగా నిర్ధారించ‌గా.. ఎంఏ, ఎంకామ్ కోర్సులకు రూ. 15,400 నుంచి రూ. 30 వేల వరకూ ఫీజులను ఫైన‌ల్ చేసిన‌ట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.. ఉన్నత విద్యా నియంత్రణ మండలి నిర్దేశించిన వార్షిక ఫీజులోనే ట్యూషన్, అఫిలియేషన్, ఐడెంటిటీ కార్డు, స్టడీటూర్ లాంటి ఫీజులన్నీ కలిపి ఉంటాయని స్ఫష్టం చేసింది ఏపీ ప్ర‌భుత్వం.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే  ఆయా విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర.