'పోస్కో'కు ఏపీ సర్కార్‌ లేఖ.. పూర్తి సహకారం..!

'పోస్కో'కు ఏపీ సర్కార్‌ లేఖ.. పూర్తి సహకారం..!

పోస్కో కంపెనీకి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావాలని లేఖలో కోరింది ఏపీ సర్కార్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పోస్కోకు లేఖ రాశారు ఏపీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్... కృష్ణపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పోస్కోను గతంలోనే కోరానని విశాఖ పర్యటనలో కార్మిక సంఘాలకు సీఎం వైఎస్ జగన్‌ వివరించిన సంగతి తెలిసిందే.. పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొస్తే పూర్తిస్థాయి సహకారం అందించేందుకి సిద్దంగా ఉన్నామని ఇవాళ రాసిన లేఖలో ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ పారిశ్రామిక పాలసీ ప్రకారం ప్రొత్సహాకాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని లేఖలో స్పష్టం చేశారు. కాగా, వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత.. పోస్కో గురించి పెద్ద చర్చే జరిగింది... పోస్కో ప్రతినిధులు.. సీఎం జగన్‌ను కలవడంతో... వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను వారికి అప్పగిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే కాగా.. తన వైజాగ్ పర్యటనలో దీనిపై క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.