ఆర్టీసీ సమ్మె, హైకోర్టులో పరిణామాలు..! పరిశీలిస్తోన్న ఏపీ సర్కార్..!

ఆర్టీసీ సమ్మె, హైకోర్టులో పరిణామాలు..! పరిశీలిస్తోన్న ఏపీ సర్కార్..!

ఓ వైపు సుదీర్ఘంగా సాగుతోన్న ఆర్టీసీ కార్మికులు పోరాటం.. మరోవైపు హైకోర్టులో జరుగుతోన్న పరిణామాలపై ఓ లుక్కేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో జరుగుతోన్న వాదనలు, పరిణామాలను పరిశీలిస్తోంది ఏపీ సర్కార్. కాసేపట్లో ఆదాయార్జన శాఖలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈ తెలంగాణ ఆర్టీసీ సమ్మె, హైకోర్టులో జరుగుతోన్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ వాదనలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో సాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం చెల్లుబాటు అవుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.