అన్నదాతలకు జగన్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

అన్నదాతలకు జగన్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

అన్నదాతలకు శుభవార్త చెప్పింది ఏపీలోని వైఎస్‌ జగన్‌ సర్కార్.. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిల కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసి.. సంక్రాంతి పండుగ సమయంలో తీపికబురు అందించింది... ఆర్థిక శాఖ ఈ మొత్తాన్ని సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు విడుదల చేసింది. దీంతో.. సేకరించిన ధాన్యానికి సంబంధించి 15 రోజులపైబడి చెల్లించాల్సిన సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేసినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇక, మిగతా బకాయిలను కూడా త్వరలోనే చెల్లించి.. ఇంకా కొనాల్సిన ధాన్యాన్ని మద్దతు ధరకు సేకరిస్తామని చెబుతున్నారు. కాగా, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. ధాన్యం బకాయిలపై చర్చించిన సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలను సంక్రాంతి నాటికి చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.