బాబు నివాసం దగ్గర భద్రత కుదింపు..

బాబు నివాసం దగ్గర భద్రత కుదింపు..

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌కు భద్రతను కుదించిన రాష్ట్ర ప్రభుత్వం... ఇక చంద్రబాబు కుటుంసభ్యులకూ భద్రతను తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఓవైపు టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఇవాళ చంద్రబాబు నివాసం దగ్గర కూడా భద్రత కుదించారు. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర భద్రతను పూర్తిగా తగ్గించారు. ఇప్పటి వరకు ఉన్న ఏపీఎస్పీ భద్రతను తొలగించిన ప్రభుత్వం... చంద్రబాబు నివాసం దగ్గర ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో మాత్రమే భద్రతా చర్యలు చేపట్టింది.