ఏపీ పంచాయతీ ఎన్నికలు.. సుప్రీంకోర్టు విచారణ

 ఏపీ పంచాయతీ ఎన్నికలు.. సుప్రీంకోర్టు విచారణ

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... పంచాయతీ ఎన్నికల పిటిషన్‌ను త్వరగా విచారించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు ఏపీ ప్రభుత్వ తరపు లాయర్.. పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును నిలుపుదలయ చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించింది ఏపీ సర్కార్.. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.. అయితే, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని తప్పులు ఉన్నాయని.. వాటిని సరిచేసే విషయంలో కొన్ని సూచనలు చేసింది అత్యున్నత న్యాయస్థానం.. అయితే, ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకావం ఉంది. కాగా, కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతోన్న సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ఏపీ హైకోర్టు తీర్పును వెంటనే నిలుపుదల చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం.. ఫిబ్రవరి మొదటివారంలో పోలీసులకు వ్యాక్సినేషన్‌ ఉంటుంది... ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలను నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి... ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రేపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.. మళ్లీ పిటిషన్ దాఖలు చేసినా.. సోమవారం విచారణ జరగనుంది.. అంటే, ఆ లోపే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏపీ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో.. సోమవారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.