హస్తినలో ఏపీ గవర్నర్ బిజీబిజీ

హస్తినలో ఏపీ గవర్నర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బిజీబిజీగా గడుపుతున్నారు.. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు గవర్నర్... ఏపీలోని ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. ఏపీలో శాంతిభద్రతల సమస్య ఉంది, టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయంటూ.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని హోంశాఖ మంత్రికి వివరించే అవకాశం ఉంది. ఇక సాయంత్రం 5.30 గంటలకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీకానున్నారు గవర్నర్ హరిచందన్... తన ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతోన్న ఆయన... హస్తిన పర్యటన ముగించుకుని శనివారం అమరావతి చేరుకుంటారు.