లోకల్‌ వార్‌.. నేడు గవర్నర్‌తో ఎస్‌ఈసీ, సీఎస్‌ భేటీ

లోకల్‌ వార్‌.. నేడు గవర్నర్‌తో ఎస్‌ఈసీ, సీఎస్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా ఏపీ ఎస్‌ఈసీ, సీఎస్‌లకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో, 10.30 గంటలకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌తో భేటీ కానున్నారు గవర్నర్‌. ఎన్నికల నిర్వహణపై ఇద్దరి నుంచి సమాచారం తీసుకోనున్నారు. ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ కంటే ముందే ఎస్‌ఈసీ, సీఎస్‌లతో భేటీ కానున్నారు రాష్ట్ర గవర్నర్‌. దీంతో.. పంచాయతీ ఎన్నికల వేళ... ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు అవుతుంది. ఊహించని ట్విస్టులతో ఏపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారిపోయాయి.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, ప్రభుత్వం... వ్యూహ ప్రతివ్యూహాలతో రక్తికట్టిస్తున్నారు. మొన్నటివరకు ప్రత్యక్ష యుద్ధం నడిచింది. మంత్రులు, వైసీపీ నేతలు.. ఎస్‌ఈసీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. ఉద్యోగ సంఘాలు సైతం... ఎస్‌ఈసీతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. సుప్రీం తీర్పు తర్వాత... సీన్ మారింది. నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య పరోక్ష యుద్ధం సాగుతోంది. దీంతో.. గవర్నర్‌తో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.