ఉద్యోగులు, అధికారులకు ఇళ్ల స్థలాలు...

ఉద్యోగులు, అధికారులకు ఇళ్ల స్థలాలు...

ఉద్యోగులు, అధికారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాధికారులకు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్ల కేటాయింపుపై నూతన విధానం తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలన్న ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆలిండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు చొప్పున కేటాయించే యోచనలో ఉన్నారు... సొసైటీల ద్వారా స్థలాల కేటాయింపు చేయనున్నారు. ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు నోడల్ ఏజెన్సీగా సీఆర్‌డీఏ పనిచేయనుంది. రెండేళ్లకు మించి రాష్ట్రంలో పనిచేస్తున్న అందరికీ స్థలాలు కేటాయిస్తారు. సెక్రటేరియెట్, అసెంబ్లీల్లో పని చేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. హైకోర్టులో పనిచేసే సబార్డినేట్ స్టాఫ్‌కు, రాష్ట్ర రాజధానిలోని హెచ్‌వోడీల్లో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు స్థలాలు కేటాయిస్తారు. గ్రూపు, లేదా కోఆపరేటీవ్ సొసైటీ ద్వారానే కేటాయింపులు జరుగుతాయి. మరోవైపు అమరావతి అక్రిడేటెడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు ఎకరం రూ.25 లక్షల చొప్పున 30 ఎకరాలు సీఆర్‌డీఏ పరిధిలో కేటాయించాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్.