ఏపీ హైకోర్టు మీద, జడ్జిల మీద దూషణలు...సుమోటోగా తీసుకోమని లేఖ

ఏపీ హైకోర్టు మీద, జడ్జిల మీద దూషణలు...సుమోటోగా తీసుకోమని లేఖ


ఏపీలో ఇప్పుడు ప్రభుత్వానికి రెండు అపోజిషన్ లు అనే మాట గట్టిగా వినిపిస్తోంది. అందులో ఒకటి తెలుగుదేశం కాగా మరొకటి ఏపీ హైకోర్టు అని వైసీపీ మద్దతు దారులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ పార్టీ నేతలే న్యాయస్థానాల తీర్పులపై అనుమానాలు కలిగించేలా మాట్లాడుతుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా హైకోర్టును, జడ్జ్ లను విపరీతమైన బాషతో ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ విషయం మీద  పోస్టింగ్ లు చేసిన వారిపై కేసును సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ  లేఖ రాశారు. మొత్తం పదకొండు మంది సోషల్ మీడియాలో రాసిన స్క్రీన్ షాట్ లను ఆయన తన లేఖకు జత చేశారు. అందులో ఆయన నలుగురి పేర్లను ప్రస్తావించారు. ఇక సుధాకర్ కేసు హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని కోరారు. చిన్నచిన్న కేసులు సీబీఐ ద్వారా విచారణ జరపడం సరికాదని అన్నారు. సుధాకర్ కేసు విచారణ జరపడానికి రాష్ట్రంలో ఒక్క నిజాయితీ గల అధికారి కూడా హైకోర్టుకి కనిపించ లేదా అని ఆమంచి ప్రశ్నించారు. ప్రతి విషయానికీ సీబీఐ విచారణ జరిపితే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ ఉన్న ప్రతి చోటా సీబీఐ ఆఫీసు పెట్టాల్సి వస్తుందని  వ్యాఖ్యానించారు.