ముందే వీవీ ప్యాట్‌ కౌంటింగ్ కుదరదు..!

ముందే వీవీ ప్యాట్‌ కౌంటింగ్ కుదరదు..!

ఎన్నికల్లో వీవీ ప్యాట్లలోని స్లిప్పులతో లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈవీఎం కంటే ముందుగానే 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలనే వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. వీవీ ప్యాట్ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని వెల్లడించింది. కాగా, హైకోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ ఇంట్లో ఎన్నికల కౌంటింగ్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఈవీఎంల కంటే ముందుగానే 5 వీవీ ప్యాట్‌లు కౌంటింగ్ చేయాలని పిటిషన్ వేసిన బాలాజీ అనే న్యాయవాది... ముందే వీవీ ప్యాట్‌లు కౌంట్ చేయాలి.. ఏదైనా తేడాలు వస్తే అన్ని వీవీ ప్యాట్‌లు కౌంటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ పిటిషన్‌ను కొట్టివేసి... సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని వెల్లడించారు.