పార్లమెంట్‌ ఆవరణలో ఏపీ ఎంపీల నిరసన..

పార్లమెంట్‌ ఆవరణలో ఏపీ ఎంపీల నిరసన..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. విభజన హామీల అమలుతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఎంపీలు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, వైసీపీ నేతలు కూడా నిరసనకు దిగారు. ఏపికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.