నేడే మంత్రుల ప్రమాణస్వీకారం..

నేడే మంత్రుల ప్రమాణస్వీకారం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వెలుపల మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. సభా వేదిక, గ్యాలరీలు, బారికేడ్లు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లు  జరుగుతున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు, అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి 5వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తారు. పాస్‌లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్ లేకుండా సామాన్యులు ప్రమాణస్వీకారంకు హాజరుకావొచ్చన్నారు. అతిథులందరికి అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 మందితో భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.