సోషల్ మీడియా ఎఫెక్ట్: ఏపీ మంత్రులు ఉక్కిరిబిక్కిరి..!

సోషల్ మీడియా ఎఫెక్ట్: ఏపీ మంత్రులు ఉక్కిరిబిక్కిరి..!

సోషల్ మీడియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు తలనొప్పిగా మారింది... తాజాగా ప్రమాణస్వీకారం చేసి.. తొలి కేబినెట్‌ సమావేశానికి మంత్రులకు సిద్ధమైన సమయంలో సోషల్ మీడియాలో మంత్రుల ఫోన్ నంబర్లు వైరల్‌గా మారిపోయాయి. సోషల్ మీడియాలో మంత్రుల సెల్ నంబర్లు ప్రత్యక్షం కావడంతో.. లైక్‌లు, షేరింగ్‌లో అవికాస్త విస్తృతంగా సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో, మంత్రులకు వరుసగా కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. అది వాళ్లను ఇబ్బందిపెట్టే స్థాయినికి వెళ్లిపోయింది. వరుస కాల్స్‌తో కొందరి మంత్రుల ఫోన్లు హ్యాంగ్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు మంత్రులు. కొందరైతే ఏకంగా ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారని చెబుతున్నారు.