ఏపీలో ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక విభాగం...

ఏపీలో ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక విభాగం...

ఆంధ్రప్రదేశ్‌ల పెట్టుబడుల భద్రత, రక్షణపై ఏపీ ప్రవాస భారతీయుల ఫిర్యాదులు పరిష్కారం కోసం అమరావతిలో ప్రేత్యేక విభాగాన్ని ప్రారంభించారు ఏపీ డీజీపీ ఠాకూర్... ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సెక్రెటరీ హోమ్ అనురాధ, ఏపీ ఎఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవి, సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్,  ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. విదేశీ పెట్టుబడిదారుల ఫిర్యాదుల కోసం ఈమెయిల్ cid@gmail.com, వాట్సప్, మొబైల్ హెల్ప్ లైన్ నెంబర్ 94407 00830, టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబర్ 1800 300 26234 పెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతం అన్నారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేవారు డీజీపీ... రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టే ఎన్నారైలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఐడీ ఆధ్వర్యంలో ప్రేత్యేక విభాగం ఏర్పాటు చేశామని వెల్లడించిన ఆయన... ఈ విభాగంలో కేవలం ఎన్నారైల పెట్టుబడులకు సంబంధించిన కేసులు మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేవారు. ఎన్నారైల ఆస్తులు రక్షణ, కిడ్నాప్, బెదిరింపులు, శాంతి భద్రతలు, విదేశీ ప్రతినిధులు వీసా సదుపాయాలు వంటి వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. పోలీసులుశాఖలోని వివిధ విభాగాల పాటు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఐటీ, ఫార్మా, సీఐఐ నుండి ప్రతినిధులు, అధికారులుతో అడ్వైజరి బోర్డ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.