ఆంధ్రాలో 8లక్షలకు చేరిన కరోనా

ఆంధ్రాలో 8లక్షలకు చేరిన కరోనా

విజయవాడా: ప్రతిరోజుకు కరోనా బలం పుంజుకుంటుంది. వేల మంది సోకి తన బలాన్ని చూపుతోంది. అయితే దేశంలో రికవరీ రేటు 90 శాతానికి చేరిన విషయం తెలిసిందే. మరి ఆంధ్రలో ఏం జరుగుతుందో తెలుసా? తెలుసుకుందాం.. ఆంధ్రాలో గత 24 గంటల్లో 3,765 కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికి ఆంధ్రా కరోనా కేసుల లెక్కల్లో 8 లక్షల మార్క్‌ను చేరుకుంది. అయితే ఈ 24 గంటల్లో మొత్తం 80,238 పరీక్షలు చేసినట్లు చెప్పారు. అందులో 3,765 మంది కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ దీనిపై స్పందించింది. గత 24 గంటల్లో 20 మంది మరణించారని, దాంతో ఆంధ్రా మరణాల రేటు 6,544కు చేరిందని తెలిపారు. అయితే ఇప్పటివరకూ 74,28,014 సాంపుల్స్‌ను పరీక్ష చేసినట్లు తెలిపారు. అందులో 7,62,419 మంది డిస్చార్జ్‌ అయినట్లు తెలిపారు. ఇంకా 31,721 మంది ఇంకా కరోనాతో పోరాడుతున్నారని, వారిని త్వరలో ఆరోగ్యవంతులను చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అయితే ఆంధ్రాలో 532 కేసులతో పశ్చమ గోదావరీ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. తరువాత గుంటూరు 523, తూర్పు గోదావరి 475, కృష్ణ 460, చిత్తూర్ 347,ప్రకాశం 317, కడప 225, విశాఖపట్టణం 218, శ్రీకాకుళం 199, అనంతపూర్ 152, విజయనగరమ్ 126, నిల్లూరు 122, కర్నూల్ 69 కేసులతో వరుస స్థానాల్లో నిలిచాయి.