ఇన్ స్పైర్ అవార్డుల్లో ఏపి సత్తా

ఇన్ స్పైర్ అవార్డుల్లో ఏపి సత్తా

దేశవ్యాప్తంగా ఇన్ స్పైర్ అవార్డుల ఎంపికలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. 2018-19 సంత్సరానికి గానూ సెకండ్ ఫ్లేస్  లో నిలిచింది. ఇన్ స్పైర్ పురస్కారాలకు ఏపి నుంచి మొత్తం 5,698 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఆన్ లైన్ లో పాఠశాలల నుంచి 20వేల ప్రాజెక్టులపై దరఖాస్తులు సమర్పించగా, 5,698 ఎంపికయ్యాయి.  రాష్ట్రస్థాయిలో 1,772 అవార్డులతో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలోను, అనంతపురం 850, నెల్లూరు 589 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిల్చాయి. 48 పాయింట్లతో విజయనగరం చివరి స్థానంలో నిల్చింది. ఈ అవార్డు కింద ఎంపికైన ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తుంది. ఈ మొత్తంతో విద్యార్ధులు సైన్సు ప్రాజెక్టులను రూపకల్పన చేసుకోవచ్చు.