తెలంగాణ ఎన్నికలకు ఏపీ పోలీసులు!

తెలంగాణ ఎన్నికలకు ఏపీ పోలీసులు!

తెలంగాణలో  డిసెంబరు 7న జరిగే ఎన్నికలకు ఏపీ నుంచి పోలీసు బలగాలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఈసీ  కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖకు లేఖ రాసింది. తెలంగాణ ఎన్నికలకు ఏపీ పోలీసులు వద్దంటూ ఇప్పటికే ఆ రాష్ట్ర ఈసీ స్పష్టం చేసింది. ఐతే.. తమవైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేనందున తెలంగాణ ఈసీ రాసిన లేఖ ఆధారంగా కేంద్ర హోంశాఖ, ఈసీకి అదే విషయాన్ని ఏపీ పోలీసు శాఖ స్పష్టం చేయబోతున్నట్లు తెలిసింది.