ఏపీ కరోనా : 1000కి చేరువలో రోజువారీ కేసులు...

ఏపీ కరోనా : 1000కి చేరువలో రోజువారీ కేసులు...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,99,812 కు చేరింది.  ఇందులో 8,86,498 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,104 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఐదుగురు మరణించారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,210 కి చేరింది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 282 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.