ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే...?

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే...?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 31,809 సాంపిల్స్ పరీక్షించగా.. 1,271 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇదే సమయంలో 464 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,03,260 కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,87,898 కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 8,142 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,220 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.