ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.  నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 139 కేసులు నమోదు కాగా, ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 137 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,694  కి చేరింది.  ఇందులో 8,78,060  మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,488 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,146 కి చేరింది.  ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 167 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.