ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు...

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు...

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,765 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597 కు చేరింది.  ఇందులో 8,94,896 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,422 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 11 మంది మరణించారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,279 కి చేరింది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,245 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.