నా కోసం ట్రాఫిక్ ఆపకండి..

నా కోసం ట్రాఫిక్ ఆపకండి..

తన కోసం ట్రాఫిక్‌ను నిలిపి, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. గురువారం ఉదయం డీజీపీ వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. డీజీపీ గన్నవరం నుంచి విజయవాడకు వస్తుండగా ట్రాఫిక్‌ నిలిపివేశారు. విషయం తెలుసుకున్న డీజీపీ ఠాకూర్ తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ ఆపవద్దని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు కూడా డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇదే విషయాన్ని తెలిపారు.