ఏపీలో పోలింగ్‌ శాతం ఇదీ..

ఏపీలో పోలింగ్‌ శాతం ఇదీ..

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 76.69 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కొన్ని చోట్ల పోలింగ్‌ జరగడంతో 80 శాతం మించుతుందని అనుకున్నప్పటికీ 76.69 శాతానికే పరిమితమైంది. 85 శాతంతో ప్రకాశం జిల్లా టాప్‌లో ఉంది.

జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ వివరాలు చూస్తే..

 • శ్రీకాకుళం 72 శాతం
 • విజయనగరం 85 శాతం
 • విశాఖ 70 శాతం
 • తూర్పు గోదావరి 81 శాతం
 • పశ్చిమ గోదావరి 70 శాతం
 • కృష్ణా 79 శాతం
 • గుంటూరు 80 శాతం
 • ప్రకాశం 85 శాతం
 • నెల్లూరు 75 శాతం
 • కడప 70 శాతం
 • కర్నూలు 73 శాతం
 • అనంత 78 శాతం
 • చిత్తూరు 79 శాతం