చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రి

చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రి

రాజ్యసభ మాజీ  సభ్యుడు చిరంజీవికి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి మంత్రి వెళ్లి కలిశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చిరంజీవి ఎంపీ నిధులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. చిరంజీవి సహకారంతో రూ.5కోట్లతో చేపట్టిన పనులు ఏడాదిలోగా పూర్తిచేస్తామని చెప్పారు. తాను మంజూరు చేసిన నిధులతో పనులు వేగవంతంగా సాగుతుండడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.