వైసీపీ, టీడీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి

వైసీపీ, టీడీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి

17వ లోక్‌సభ కొలువుదీరింది. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ, టీడీపీ ఎంపీలు ఇవాళ తొలిరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ కొత్త ఎంపీలతో ప్రమాణం చేయించారు. కొంతమంది ఎంపీలు ఇంగ్లీష్‌లో ప్రమాణం చేయగా.. మరికొంత మంది తెలుగులో చేశారు. ఇద్దరు ఎంపీలు హిందీలో ప్రమాణ పత్రం చదివారు.

తెలుగులో ప్రమాణం చేసిన ఎంపీలు..

 • గొడ్డేటి మాధవి(అరకు)
 • బెల్లాన చంద్రశేఖర్(విజయనగరం)
 • ఎంవీవీ సత్యనారాయణ(విశాఖపట్నం)
 • డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి(అనకాపల్లి)
 • వంగా గీతా విశ్వనాథ్(కాకినాడ)
 • మార్గాని భరత్(రాజమండ్రి)
 • వల్లభనేని బాలశౌరి(మచిలీపట్నం)
 • నందిగం సురేశ్(బాపట్ల)
 • తలారి రంగయ్య(అనంతపురం)
 • వైఎస్ అవినాష్ రెడ్డి(కడప)
 • ఆదాల ప్రభాకర్ రెడ్డి(నెల్లూరు)
 • ఎన్.రెడ్డప్ప(చిత్తూరు) 

ఇంగ్లీష్‌లో  ప్రమాణం చేసిన ఎంపీలు..

 • కనుమూరి రఘురామ కృష్ణం రాజు(నరసాపురం)
 • కోటగిరి శ్రీధర్(ఏలూరు)
 • కేశినేని శ్రీనివాస్(విజయవాడ)
 • గల్లా జయదేవ్(గుంటూరు)
 • లావు శ్రీకృష్ణదేవరాయలు(నరసారావుపేట)
 • మాగుంట శ్రీనివాసులు రెడ్డి(ఒంగోలు)
 • పోచా బ్రహ్మానందరెడ్డి(నంద్యాల)
 • ఆయుష్మాన్ సంజీవ్ కుమార్(కర్నూలు)
 • కురువ గోరంట్ల మాధవ్(హిందూపురం)
 • బల్లి దుర్గాప్రసాద్(తిరుపతి)
 • పీవీ మిథున్ రెడ్డి(రాజంపేట)  
 • కింజారపు రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), చింతా అనురాధ(అమలాపురం) మాత్రం హిందీలో చేశారు