ఏపీలో పోలింగ్‌ శాతం 85..?

ఏపీలో పోలింగ్‌ శాతం 85..?

ఏపీలో భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశముంది. గతంతో పోల్చితే గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఏకంగా 85 శాతం వరకూ తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 74 శాతం నమోదైంది. అర్ధరాత్రి దాటాక కూడా కొన్ని చోట్ల పోలింగ్‌ జరగింది. పోలింగ్‌ శాతం 80కి చేరితే... రాష్ట్రంలో ఇదే తొలిసారి అవనున్నది. రాష్ట్రంలో ఎంత శాతం పోలింగ్‌ జరిగిందీ ఇవాళ ఈసీ అధికారికంగా ప్రకటించనున్నది.


నిన్న రాత్రి సమయానికి పోలింగ్‌ శాతం...

శ్రీకాకుళం 74.18%
విజయనగరం 69.43%
విశాఖపట్నం 76.4 %
తూర్పుగోదావరి 74.28%
పశ్చిమగోదావరి 70.59%
కృష్ణా  71.18%
గుంటూరు 72.7%
ప్రకాశం 73.52%
నెల్లూరు 68.25%
కడప 71.3%
కర్నూలు 68.3%
అనంతపురం  71.63%
చిత్తూరు 72.4%