కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 'ఏపీకి ప్రత్యేక హోదా'కి చోటు

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 'ఏపీకి ప్రత్యేక హోదా'కి చోటు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఇవాళ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపరిచింది. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని మేనిఫెస్టోలో వివరించింది. హ‌మ్ నిభాయేంగే(మేం నెర‌వేరుస్తాం) టైటిల్‌తో విడుదలైన ఈ మేనిఫెస్టోలో..  పేదరిక నిర్మూలనకు ఉద్దేశించి రూపొందించిన కనీస ఆదాయం హామీ పథకం 'న్యాయ్‌' ప్రధానమైనది. ఉద్యోగ కల్పన, ఆరోగ్య పరిరక్షణ, వైద్య సదుపాయాలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. రైతుల కోసం ఏటా 'కిసాన్‌ బడ్జెట్‌' ప్రవేశ పెడతామని ప్రకటించిన కాంగ్రెస్‌.. వ్యవసాయ అభివృద్ధి, ప్రణాళికలకు శాశ్వత జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. జ‌మ్మూక‌శ్మీర్ అభివృద్ధి కోసం కొత్త ఎజెండా రూపకల్పనతోపాటు స‌ర‌ళ‌త‌ర‌మైన జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో రాజ‌కీయ ప్రమేయం ఉండదని స్పస్టం చేసింది.